Sunday, April 27, 2008

మరికొన్ని కవితలు

http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=491&pageNo=0
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=501&pageNo=0
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=487&pageNo=0
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=457&pageNo=0
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=340&pageNo=0
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=313&pageNo=0

Friday, December 08, 2006

ఓ కవనం

writer----ramanad veturi

ఏమి సాధించావని ఈ గావుకేకల గానం
వాదించి ఓడించలేక కాదు ఈ మౌనం

ఏ దరికో దిక్కులెంట దిక్కుతోచని నీ పయనం .....

బెదిరిన మనసు
బాధించిన మనిషి పై
రాసిందిలా ఓ కవనం....!

Wednesday, December 06, 2006

పల్లకి

writer--రామానంద్ వేటూరి

అంగరంగ వైభవంగా
అత్తవారింట అడుగుపెట్టు తరుణమది...

తనదయిన నవ జీవితంలోకి
ఆశగా అడుగుపెట్టు వధువుకు
జీవితపు వడి దుడుకులకు
తొలి మజిలీ నేనే అంటోందా పల్లకి!

పుట్టినింట పుత్తడిబొమ్మకి
మెట్టినింటికి దారి పరచి
కడ దాకా రాలేనన్న సంగతి మరచి
మురిపెంగా నేనున్నా అంటొంది ఆ పల్లకి!

కంటిపాపలా పెంచిన వారు
కంటి కొనలు దాటిపోతుంటే...
కనులెదట మనువాడినవాడుండగా
కంటికొలనులో కన్నీరెందుకే అంటోంది ఆ పల్లకి!

మది నిండా మమకారపు అలోచనలు సుడిగుండాలయి
యెద నిండా యేలుకునే వాడిపై యేకాగ్రత కుదరక
బరువెక్కిన హ్రుదయంతొ భారంగా కూర్చున్న వధువు
భారం కాసేపయినా మోయనివ్వమని ముందుకు కదిలిందా పల్లకి!!!

Thursday, November 30, 2006

ప్రవాసమా...ఇది వనవాసమా?

రామానంద్ వేటూరి----

వీధి దాటి,వాడ దాటి
ఊరు దాటి,యేరు దాటి
దేశం దాటి
సప్త సముద్రాలను దాటాం
శాపగ్రస్తుల్లా బ్రతుకీడుస్తున్నాం!

మాత్రు దేశాన్ని వదిలి
కన్నవాళ్ళను వదిలి
మిత్రులను వదిలి
కడలి దాటాం...కష్టాల కడలీదుతున్నాం!

జగమెరిగిన దేశం మనదని గర్విస్తాం
మరి,ఇంత తెలిసీ వలసెందుకు వస్తున్నాం

మనదేశం చేసిన పాపమా?
కాలచక్రపు కలికాలమా?
తల్లి భారతికి మూగ రోదనమా?
ప్రవాసమా...ఇది వనవాసమా?

కాలం చేసిన మోసం

writer---రామానంద్ వేటూరి---

కాలం మారింది
అని కొమ్మచాటు కోయిల గొంతు విప్పింది

కాలం మారింది
మరి మనసు మారదేమి?

రాలి పడిన పువ్వులు చూస్తూ..
పండి రాలిన ఎండుటాకులు చూస్తూ..
యద లో రేగే సుడిగుండాలను తీరమెందుకు తాకనిచ్చింది?
అంధకారం లో వుంటూ అశ్రువుల అసువులెందుకు విడిచింది?

పాపం మనసు..
కొత్త రెమ్మల మీద కోయిలమ్మను చూసి
ఉత్త ప్రేమలు చేసిన గాయాన్ని తలచి
ఎక్కిపట్టి ఏడ్చింది..
మూగ భావాలను తొక్కి పట్టి వుంచింది!

కాలం మారిందని
కోయిల గానం ఆపిందా?
నెమలి నాట్యం ఆగిందా?
మరి మనసెందుకిలా బాధలో మునిగింది?
ఎందుకిలా ఒంటరిగా రోదిస్తోంది?

వసంతం కోసం ఎదురుచూసే కోయిలేగా మనసు
వర్షం కోసం చూసే చక్రవాకమేగా మనసు
అన్ని తెలిసి మనిషికెందుకు మనసంటే అంత అలుసు?

కాలం చేసిన మోసాన్నే తలుచుకుంటూ...
అయినా..
కాలానికేం తెలుసు మనిషి బాధ..?
మనిషికేం తెలుసు మనసు బాధ..?

ఊహ..

రామానంద్ వేటూరి---

మనసు కాగితం పై మనిషి రాసిన చిలిపి రాత.........

మూగ మనసుకు ఎన్ని ఊహలో?



ఎదురుచూసిన మానసి ఎదురుగా వుంటే
మనసేమిటి....మనిషేమిటి....
అసలు...మాటే.. రాదేమిటి?

వసంతం

రామానంద్ వేటూరి--

వసంతం వచ్చి వరించిందని
పచ్చని చెట్లన్ని పెళ్ళికూతురులై
వలపుతో,పెళ్ళి పిలుపులనిస్తూ
వచ్చేసింది,మెచ్చి,నచ్చేసిందని
విరహాన్ని హరితమై ఆరబోస్తుంటే
వర్షం లా హర్షం వ్యక్తం చేసిందట
కురిపిస్తూ..చినుకుల తలంబ్రాలు

Wednesday, November 29, 2006

marikonni...

http://www.telugupeople.com/discussion/article.asp?id=42990
http://www.telugupeople.com/discussion/article.asp?id=42358
http://www.telugupeople.com/discussion/article.asp?id=41285
http://www.telugupeople.com/discussion/article.asp?id=40922
http://www.telugupeople.com/discussion/article.asp?id=21450
http://www.telugupeople.com/discussion/article.asp?id=40870
http://www.telugupeople.com/discussion/article.asp?id=40763
http://www.telugupeople.com/discussion/article.asp?id=42721
http://www.telugupeople.com/discussion/article.asp?id=40389

marinni..

http://www.telugupeople.com/discussion/article.asp?id=46732
http://www.telugupeople.com/discussion/article.asp?id=42528
http://www.telugupeople.com/discussion/article.asp?id=42028
http://www.telugupeople.com/discussion/article.asp?id=40513
http://www.telugupeople.com/discussion/article.asp?id=40085
http://www.telugupeople.com/discussion/article.asp?id=45761
http://www.telugupeople.com/discussion/article.asp?id=45173
http://www.telugupeople.com/discussion/article.asp?id=45069
http://www.telugupeople.com/discussion/article.asp?id=44294
http://www.telugupeople.com/discussion/article.asp?id=44084
http://www.telugupeople.com/discussion/article.asp?id=44053
http://www.telugupeople.com/discussion/article.asp?id=43584

marinni...

http://www.telugupeople.com/discussion/article.asp?id=29009
http://www.telugupeople.com/discussion/article.asp?id=28284

naku nachina marikonni kavitalu

http://www.telugupeople.com/discussion/article.asp?id=48916
http://www.telugupeople.com/discussion/article.asp?id=48552
http://www.telugupeople.com/discussion/article.asp?id=47885
http://www.telugupeople.com/discussion/article.asp?id=47446
http://www.telugupeople.com/discussion/article.asp?id=46998
http://www.telugupeople.com/discussion/article.asp?id=41623
http://www.telugupeople.com/discussion/article.asp?id=40689
http://www.telugupeople.com/discussion/article.asp?id=36356
http://www.telugupeople.com/discussion/article.asp?id=35087
http://www.telugupeople.com/discussion/article.asp?id=31478

Wednesday, November 22, 2006

మౌనం

రోహిణి--

శశి రాక కోసం
నిశి రాతిరి వేళ
కనులు కాయలు కాచిన
కలువ బాల విరహగీతం - మౌనం

నులివెచ్చని కిరణానికి
తొలి సంధ్య వేళ
మౄదు రేకు విచ్చిన
కమల కన్నె దరహాస గీతం - మౌనం

ఎల కోయిలను పిలవాలని
నవ వసంత వేళ
తొలి చిగురు తొడిగిన
లేత మావి కొమ్మ స్వాగత గీతం - మౌనం

సెలయేటి అలల పై
నిండు పున్నమి వేళ
తనివార తేలియాడే
చిరు తెమ్మెర తేట గీతం - మౌనం

కొండ కోనల తిరిగి
కర్షకుల కలలు పండించి
కడలి ఓడిలో సేద తీరే
నదీమతల్లి సంగమ గీతం - మౌనం

ప్రతి కదలికలో
ప్రతి కవళికలో
ప్రతిఫలించే సౌందర్యం
ప్రకృతి కాంత పరవశ గీతం - మౌనం

ఎదురుచుస్తూన్నా..

అభిసారిక--

విరహాల చీకటి తెరపై
వెన్నెలతో నీ రూపమే చిత్రిస్తూన్నా
నీ ఙ్ఞాపకాల అలజడిలో
కల్లోల కడలినై నీ పేరే జపిస్తూన్నా

ఈ క్షణం నీవు కనిపించవని తెలిసినా
నీ కోసమే ఎదురుచూస్తూన్నా...

అర్దరాత్రి..

అభిసారిక--

పగలంతా ఏం చెసినా నీ అలోచనలు
రేయంత నువ్వులేని ఒంటరితనపు జాడలు
ఇదిగో వెల్లకిలా పొడుకుని
ఇలా వెన్నెల్లో ఆకాశంకేసి చూస్తుంటే
ఒక్కో తార ఒక్కో జ్ఞాపకంలా మారి మెరుస్తూంది
నన్ను మురిపిస్తూ నీకు దెగ్గరిగా ఉన్నంత ఓదార్పునిస్తునట్టుగా

అక్కడ నిన్ను.. ఇక్కడ నన్ను.. చూస్తున్న చంద్రుడు మాత్రం
మన ప్రేమ అంత నిర్మలంగా నవ్వుతున్నాడు
నువ్వు కుశలమే అని నాకు తెలుపుతునట్టుగా

నిన్ను తాకి వచ్చిన పిల్లగాలులు కాబోలు
నీ ఊపిరి పరిమళాన్ని మోసుకొని
అల్లరిగా ఆత్మీయంగా నన్ను స్పురిస్తున్నాయి
నా ముంగుర్లను సరిచేసి కుశలమడుగుతున్నాయి

మామిడి కొమ్మ మీద గువ్వల జంట నిద్రపోకుండా
ఎదో అర్దమైనట్టు చిలిపిగా నావంక చూస్తున్నాయి
నీకు తోడుగా మేము మేల్కునే ఉన్నాం సుమా అన్నటుగా
అర్దరాత్రి కొత్తగా చాలా వింత అనుభూతినిస్తూంది
ఇలా ప్రకృతిలో ఎం చూసినా ఎటు చూసినా
నీ తలపే నీ వలపే కనపడుతూంది

నీకై వేచి చూసే నా కనులకి అలసట రానీయనట్లుగా
ఇక సూర్యోదయానికి సిద్దమౌతున్న ఆకాశాన్ని చూస్తూంటే
మనం కలవబోయే కలలో ఓ రోజు తగ్గిందనో
రంగు రంగుల ఆకాశకిరణాలని తనలోకి ఆహ్వానిస్తూంది
మన అద్బుతమైన కలయికకి త్వరలోనే నాంది పలుకుతునట్లుగా ...

కాలం

అభిసారిక--

కదులుతుంది కాలం సాగర కెరటంలా
ఏదో సాధించాలన్న ఆరాటం
సాధించవచ్చులే అన్న నిర్లక్ష్యం

కదులుతోంది కాలం
ఏదో చేద్దామనే కుతూహలం
కాని ఏమిచేయలేని పిరికితనం
ఇలా కదిలిపొతూనే..కదిలిపొయింది కాలం

చెరిగిపోయాయి స్మ్రుతులు
గడిచిన సమయం వౄధా అని విచారం
తలుచుకుంటె ఆపలేని దుఖం !

కవిత్వం

అభిసారిక--

స్వప్నం లోంచి పుట్టిన కవిత్వం
మనసులను వూహింప చేస్తుంది !
జీవితం నేర్పిన కవిత్వం
అలసిన మనసులను వూరడిస్తుంది !

డైరీ

రాజ్ (కలం పేరు సలీం )

ఎప్పుడో ఎక్కడో పోగొట్టుకున్న 'నన్ను' ని
ఈ కాగితాల్లోనే రోజూ వెతుకుతూ ఉంటాను
అనంతాలలో పారేసుకున్న అనుభూతుల వెచ్చదనాన్ని
ఈ కాగితాల్లోనే దాచుకుని నిత్యం తడుముతూ వుంటాను

ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు
ఎన్నోఆదర్శాల ఆవేశాలు
ఈ కాగితాల్లోనే రెప రెపలాడాయి

ఎన్నో కలలు కన్నీరై
ఎన్నో ప్రేమలు స్మృతిగీతాలై
ఈ కాగితాల్లోనే ఇంకుచుక్కలై ఇంకిపోయాయి

రాయాలని రాయలేక
రాయకుండా వుండలేక
పుటపుటకి ఎన్నోపురిటి నెప్పులు
ఈకాగితాల్లోనే పూర్తికాకుండా నిలిచిపోయాయి

కలకాలం నిలువలేక
కలిసి నాతో రాలేక
కదిలిపోయిన వసంతాలెన్నో
ఈ కాగితాల్లోనే పూలరెక్కలయి మిగిలి పోయాయి

నేటి 'నేడు' ని రేపటి 'నాడు' గా రాసుకోడానికి
ఈ కాగితాల్ని రొజు సవరిస్తూవుంటాను
ఎప్పుడో ఎక్కడో పోగొట్టుకున్న 'నన్ను' ని
ఈ కాగితాల్లోనే రోజూ వెతుకుతూ ఉంటాను
.

నాకు నచ్చిన కవితలు

ఎందరో మహానుభావులు.అందరికి వందనాలు. కొంతమంది కవుల మంచి కవితలు[నాకు నచ్చినవి]ఇక్కడ వుంచుతున్నాను[దాచుకుంటున్నాను] ఎప్పుడన్న చదువుకోవడానికి వీలుంటుంది గా అందుకని.లేకపోతే అన్ని సైటులకి వెళ్ళి వెతుక్కోవాల్సివస్తుంది మరి.కొన్ని కవితలకి లింకులు ఇస్తున్నాను.ఎందుకంటే వాటి కింద వున్న కామెంట్స్ కూడా చాలా వుపయోగకరం గా వుంటాయి.ఎవరి అనుమతి లేకుండా ఇక్కడ కవితలు వుంచుతున్నందుకు క్షమించగలరు.ఎవరికైన అబ్యంతరం వుంటే తెలియపరుచగలరు.